ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేది అప్పుడే..?

Divya
హీరో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ చిత్రం తర్వాత తను నటించే చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదలయ్యాయి..కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేక పోయింది. ఇక అభిమానులు కూడా సరైన సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా పైన పెద్దగా హైప్ రాలేకపోతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా పైన మాత్రమే అభిమానులు అంచనాలు పెంచేస్తున్నాయి.

కేజిఎఫ్ తరహాలో రాబోతున్న ఈ చిత్రం పై ప్రభాసభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫోటోలు, లీకులు ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పాటు చేశాయి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది .అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని కూడా సిద్ధం చేసి ఉన్నట్లుగా చిత్ర బృందం సమాచారం.
ఆదిపూరు సినిమాని జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోని సలార్ సినిమాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే జూన్ మొదటి వారంలోని సలహార సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నది.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో అలాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు ఇదివరకే డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. మరి రాబోయే అప్డేట్ సినిమా పైన ఎలాంటి అంచనాలు పెంచుతాయో చూడాలి మరి సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. దాదాపుగా  రూ.600 కోట్ల కు పైగా బిజినెస్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: