బలగం బ్యూటీ.. చిరంజీవి సినిమాలో నటించిందట తెలుసా?

praveen
సాధారణంగా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. కొంతమందికి మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆరోగ్యం ఎంత అదృష్టం కలిసి వస్తేనే ఇండస్ట్రీలో హీరోయిన్గా విజయాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇలా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కు మొదటి సినిమాతోనే మంచి విజయం వరించింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులు అందరికీ వల్లంకి పిట్టగా మారిన కావ్య కళ్యాణ్ రామ్ ఇక ఇటీవల బలగం అనే సినిమాతో మంచి గుర్తింపు స్పదించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బలగం సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి పొట్టి పిల్లగా మారిపోయింది ఈ హీరోయిన్.

 ఇక మొదటి సినిమాలోనే తన నటనతో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక బలగం సినిమా ఎంత సెన్సేషన్ విజయం సాధించింది అన్నది కొత్తగా చెబితే అవుతుంది. ఓకే ఇప్పుడు తెలంగాణ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంటుంది కావ్య కళ్యాణ్ రామ్. అయితే ఈ అమ్ముడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అటు అల్లు అర్జున్ తో పాటు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా నటించింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించింది అన్నది కొంతమందికి మాత్రమే తెలుసు.

 మెగాస్టార్ హీరోగా నటించిన ఒక సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిందట. ఆ సినిమా ఏదో కాదు ఠాగూర్. వి వి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ మెగాస్టార్ కెరియర్ లో ఎవర్ గ్రీన్ సినిమాగా కొనసాగుతుంది.  అయితే ఈ సినిమాలో చిరంజీవి దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈమధ్య ఓ సందర్భంలో చిరంజీవి గారిని కలిసాను. ఆయన నన్ను గుర్తుపడతారా లేదా అనుకున్న. కానీ నేను సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని చెప్పాను. నేను ఠాగూర్ సినిమాలో అనగానే పిల్లి కళ్ళు అని నన్ను గుర్తుపట్టేశారు. ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా అని ఇక నా గురించి అన్ని అడిగి తెలుసుకున్నారు అంటూ కావ్య కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: