హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోయిన దసరా...!!

murali krishna
శ్యామ్ సింగరాయ్ సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో పాపులర్ అవ్వాలని భావించాడు నాని. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల హిందీ లో విడుదల చేయలేదని సమాచారం..
ఆ తర్వాత వచ్చిన సినిమా లు కూడా నాని హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదని తెలుస్తుంది.. ఎట్టకేలకు దసరా సినిమా తో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడట.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన దసరా సినిమా నిరాశ పర్చిందని చెప్పాలి.. తెలుగు లో వంద కోట్ల కు పైగా వసూళ్లు అయితే సాధించింది కానీ ఇప్పటి వరకు కనీసం హిందీ మరియు ఇతర భాషల్లో అయిదు కోట్ల రూపాయలను కూడా రాబట్టలేక పోయిందట.. తెలుగు తో పాటు హిందీ లో కూడా దసరా సినిమా కు మంచి బిజినెస్ అయితే అయిందని.. మంచి కలెక్షన్స్ కూడా నమోదు అయ్యాయి అంటూ ప్రచారం అయితే జరిగింది. కానీ అసలు సంగతి మాత్రం వేరుగా ఉంది. చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నదానికి వస్తున్న కలెక్షన్స్ కు పొంతన లేకుండా ఉంది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ లో నాని సినిమా దసరా నిరాశ పర్చడంతో పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం వెయిట్ చేస్తున్న నాని కి మరి కొన్నాళ్ల పాటు ఎదురు చూపులు తప్పవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోలు కొందరు మాత్రమే పాన్ ఇండియా స్టార్ డమ్ ను  అయితే దక్కించుకున్నారు. దసరా కి కూడా భారీ గానే పబ్లిసిటీ చేశారు. కానీ అక్కడ కనీసం సక్సెస్ కూడా అవ్వలేదు. కాంతార.. కేజీఎఫ్ రేంజ్ లో ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని భావిస్తే నిరాశ పర్చిందని నాని అభిమానులు  కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: