నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ నితిన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రిఫరెన్స్ సీన్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సినిమాల్లో అయితే పవన్ బిట్ సాంగ్స్ ని కూడా వాడేస్తూ ఉంటాడు నితిన్. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ చేయబోతున్నాడట ఈ హీరో. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నితిన్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండబోతుందట.ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమాలో జూనియర్ గా నటించే అవకాశం వస్తుందని, అదే టైం లో పవన్ కళ్యాణ్ ని గాని, తన రిఫరెన్స్ ని గాని నితిన్ చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

 అయితే పవన్ కళ్యాణ్ నితిన్ సినిమాలో కనిపిస్తాడో లేదో కానీ సినిమాలో కచ్చితంగా పవన్ ప్రస్తావన  వచ్చే సీన్స్ మాత్రం ఉంటాయట. కాబట్టి పవన్ కళ్యాణ్ ని కామియో రోల్ కోసం నితిన్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అస్సలు కాదనడు. పైగా పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తున్న సెట్స్ కి వెళ్లే ఆ సీన్స్ ని షూట్ చేసే ఆప్షన్ ఉందట. కాబట్టి కచ్చితంగా నితిన్ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఓ కామియో రోల్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అయితే త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి జూనియర్, సైతాన్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తుంది మూవీ యూనిట్.

ఇక త్వరలోనే ఈ మూవీ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇక నితిన్ ఈ సినిమాతో పాటు తాజాగా వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో భీష్మ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి వీరి కాంబో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భీష్మలో నితిన్ సరసన నటించిన రష్మిక మందన మరోసారి ఇప్పుడు నితిన్ కి జోడిగా కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'VNR Trio' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: