శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆ యువ హీరో..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో నుంచే మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ దర్శకుని దర్శకత్వంలో రూపొందినటువంటి వెంకీ ... దుబాయ్ శీను ... ఢీ ... రెడీ ... నమో వెంకటేశాయ ... దూకుడు ... బాద్ షా మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

ఇలా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలం లోనే శ్రీను వైట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే బాద్ షా మూవీ తర్వాత నుండి శ్రీను వైట్ల అనేక మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ ... ఆ మూవీ లు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాలను సాధించలేదు  చివరిగా శ్రీను వైట్ల ... రవితేజ హీరో గా ఇలియానా హీరోయిన్ గా రూపొందిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మూవీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక కథను వినిపించగా ... ఈ యువ హీరో శ్రీను వైట్ల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: