అనుపమలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?.. మాములు గడుసు కాదు కదా?

praveen
అనుపమ పరమేశ్వరన్.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కార్తికేయ సీక్వెల్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయినా అనుపమ మలయాళ ప్రేమమ్ చిత్రం తోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న అనుపమలో మనకు తెలియని చాల ట్యాలెంట్స్ ఉన్నాయంటే నమ్ముతారా ? ప్రస్తుతానికి ఒక వైపు హీరోయిన్ గా బిజీ గా ఉండి కూడా ఆమె సినిమాటోగ్రఫీ తో కూడా తానేంటో చూపిస్తుంది. ఇటీవల యూట్యూబ్ లో ఐ మిస్ యు అనే పేరుతో విడుదల అయినా ఒక షార్ట్ ఫిలిం కి అనుమప కెమెరా బాధ్యతలను తీసుకొని చక్కగా నిర్వర్తించింది. సోమవారం విడుదల అయినా ఈ లఘు చిత్రాన్ని చూసిన వారంతా అనుపమ మామూలు ఖిలాడీ కాదు కదా అని అనుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిలిం కి సంకల్ప్ ఘోరా దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా రితిగుప్తా అనే ఒక మరొక వ్యక్తి తో కలిసి డిఒపి గా అనుపమ పని చేసింది. అనుపమ పనితనానికి మంచి కామెంట్స్ కూడా వస్తుండటం విశేషం. ముందు ముందు కూడా హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఇలా సినిమాటోగ్రఫీ పైన దృష్టి పెడితే బాగుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరో వైపు ఆమె ఇటీవల నటించిన కార్తికేయ 2, బట్టర్ ఫ్లై , 18 పేజెస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. అవి మాత్రమే కాకుండా సైరెన్ అనే ఒక తమిళ చిత్రం, మలయాళం లో ఒక చిత్రం లో నటిస్తుండగా అవి ప్రొడక్షన్ లో ఉన్నాయ్. డి జె టిల్లు సీక్వెల్ నుంచి బయటకు వచ్చిన అనుపమ వేరే ఏ తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. మరి భవిష్యత్తులో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ సినిమాటోగ్రాఫర్ గా సెటిల్ అవుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: