ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో ఆ సన్నివేశాల చిత్రీకరణ..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుండగా ... ఈ సినిమా లో దేశం లోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులు కీలక పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది .

అందులో భాగంగా ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు ఆ మధ్యలో వార్తలు వచ్చాయి . కాక పోతే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడ లేదు . ఈ మూవీ కి ప్రస్తుతం ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు .

ఈ సినిమా లోని యాక్షన్స్ సన్నివేషాలను హాలీవుడ్ కొరియోగ్రాఫర్ లు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఈ నెల 8 వ తేదీన మొదటి షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ అయింది. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్లో ఈ సినిమా బృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల చివర నుండి ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: