బన్నీ ... సందీప్ కాంబినేషన్ లో రూపొందిపోయే మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... మలయాళ నటుడు పహాధ్ ఫాజల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి ... సన్ ఆఫ్ సత్యమూర్తి ... అలా వైకుంఠపురంలో అనే మూడు మూవీ లు రూపొందాయి. ఈ మూడు మూవీ లు మంచి విజయాలను సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే మరో మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ తర్వాత బన్నీ ... సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో బన్నీ సరసన మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సందీప్ ... రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న యానిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: