"గేమ్ చేంజర్" మూవీలో చరణ్ పాత్ర పై క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి ... శ్రీకాంత్ ... సునీల్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించ బోతున్నారు.

 ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ ఒక పాత్రలో గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించనుండగా ... మరో పాత్రలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు .

ఇది ఇలా ఉంటే చరణ్ గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలో కనిపించబోయే సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో రానున్నట్లు ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ లోని చరణ్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకు లీక్ అయ్యాయి. వీటిలో చరణ్ లుక్ అద్భుతంగా ఉంది. అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: