ఈ సమ్మర్ కు ఆ 3 తెలుగు పాన్ ఇండియా మూవీలు..?

Pulgam Srinivas
స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ లో చాలా ఎక్కువ విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగా వచ్చే సంవత్సరం సమ్మర్ లో కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన కొన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుక విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ లు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లు. ఈ మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: