ప్రభాస్ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్త బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ కోసం రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు ... దాదాపు ఇదే టైటిల్ ఈ సినిమాకు కన్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో సంజయ్ దత్ ..  ప్రభాస్ కు తాత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రీద్ధీ కుమార్ , నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా విజయ వంతంగా పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో మేము చేస్తున్న సినిమా స్యూర్ షాట్ గా టార్గెట్ మిస్ అవ్వకుండా హిట్ అవుతుంది అని ఈ మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: