"గేమ్ చెంజర్" మూవీలో వాటికోసం భారీ బడ్జెట్ ను ఖర్చు చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దర్శకుడి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి ... సునీల్ ... శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ మూవీ లో నటించారు. 
ఇది వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని పాటల కోసం ఈ మూవీ నిర్మాత అయినటు వంటి దిల్ రాజు భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ లోని పాటల కోసం అత్యంత భారీ సెట్ లను నిర్మించినట్లు ... అలాగే కొన్ని సాంగ్స్ ను నచురల్ లొకేషన్ లలో కూడా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు ... అలాగే ఈ మూవీలోని సాంగ్స్ కోసం అత్యంత అధునాతన టెక్నాలజీని కూడా వాడడంతో ఈ మూవీ లోని పాటలకు అత్యంత భారీ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని పాటలు కూడా చాలా అద్భుతంగా ... రిచ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: