రవితేజ "రావణాసుర" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి భారీ కలక్షన్ లభించాయి. ఇలా పోయిన సంవత్సరం అద్భుతమైన హిట్ తో సంవత్సరాన్ని ముగించిన రవితేజ ఈ సంవత్సరం ప్రారంభంలో చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా రవితేజ హిట్ తోనే మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ ... సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందినటు వంటి రవణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఫరియా అబ్దుల్లా , మేఘా ఆకాష్ , పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ ,  అను ఇమాన్యుయల్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా ... సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

హర్ష వర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందించిన ఈ మూవీ ని అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఈ సంస్థ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: