అఫీషియల్ : "వకీల్ సాబ్ 2" గురించి అప్డేట్ ఇచ్చిన వేణు శ్రీరామ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో వేణు శ్రీరామ్ ఒకరు. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి ఓ మై ఫ్రెండ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకుంది. కాకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వేణు శ్రీరామ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఈ మూవీ లో సిద్ధార్థ్ ... హన్సిక హీరో హీరోయిన్ లుగా నటించగా ... శృతి హాసన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు "ఎంసీఏ" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. నాని హీరోగా రూపొందిన ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ... పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ ని తెరకెక్కించాడు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వేణు శ్రీరామ్ "వకీల్ సాబ్ 2" మూవీ గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ... ప్రస్తుతం వకీల్ సాబ్ 2 మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇలా వకీల్ సాబ్ 2 మూవీ కి సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు ఇవ్వగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: