మహేష్ మూవీతో త్రివిక్రమ్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కెరియర్ లో ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న త్రివిక్రమ్ ఆఖరుగా అలా వైకుంఠపురంలో అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ 2020 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న  మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ఈ చిత్ర బృందం ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎన్ బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం జరుపుతుంది. శ్రీ లీల ... పూజా హెగ్డే ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. మరి 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటువంటి అలా వైకుంఠపురంలో మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ ... మహేష్ మూవీ తో కూడా అలాంటి విజయాన్నే అందుకుంటాడో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: