మహేష్ 29వ మూవీకి ఫస్ట్ ఛాయిస్ ఆ ముద్దుగుమ్మేనా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ మహేష్ కు సంబంధించిన ఫస్ట్ లుక్  పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

 ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే మహేష్ సరసన పూజా హెగ్డే "మహర్షి" మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల కు మహేష్ తో ఇది మొట్ట మొదటి సినిమా.  ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత మహేష్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొంద బోతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను రాజమౌళి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ ... రాజమౌళి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ మూవీ లో హీరోయిన్ గా రాజమౌళి ... జన్వి కపూర్ ను మొదటి ఆప్షన్ గా అనుకుంటున్నట్లు ... అన్నీ కుదిరితే ఈ మూవీ లో జాన్వీ  హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వి ... ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: