కొరటాల మూవీలో అలా కనిపించనున్న ఎన్టీఆర్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ఇప్పటికీ కూడా కొన్ని దేశాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ కలక్షన్ లను వసూలు చేస్తుంది. ఇలా ఈ మూవీ తో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలు అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రత్నవెలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ మూవీ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు కొరియో గ్రాఫర్ లుగా వర్క్ చేయనున్నారు.

అలాగే ఈ మూవీ కి మరి కొంత మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ... అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ మూవీ లో తండ్రి పాత్ర లోనూ ... కొడుకు పాత్ర లోనూ కనిపించబోతున్నట్లు ... ఈ రెండు పాత్రలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్ లలో ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: