సల్మాన్ ఖాన్ కోసం ప్రభాస్ ను తప్పించార ?

Seetha Sailaja

‘బాహుబలి’ తో ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పటికి విడుదలైన అన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు విపరీతంగా కలత చెందుతున్నారు. దీనికితోడు జూనియర్ చరణ్ అల్లు అర్జున్ లు కూడ పాన్ ఇండియా హీరోలుగా మారిపోవడంతో ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో చాల గట్టి పోటీ ఎదురౌతోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్ ప్రభాస్ అభిమానుల ఆశల పై నీళ్ళు చల్లాడు. సిద్దార్ధ్ ఆనంద్ పేరు వినగానే చాల రిచ్ గా తీసే అతడి సినిమాలు గుర్తుకు వస్తాయి. హృతిక్ రోషన్ సమస్యలలో ఉన్నప్పుడు ‘వార్’ మూవీతో బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు లేటెస్ట్ గా ‘పఠాన్’ మూవీతో షారూఖ్ ఖాన్ ను 1000 కోట్ల హీరోగా మార్చి వేసాడు.

ఆమధ్య సిద్దార్థ్ ముంబాయ్ లో ప్రభాస్ ను కలిసి ఒక సినిమా కథ వినిపించినట్లుగా వార్తలు రావడంతో ప్రభాస్ సిద్దార్థ్ ల మూవీ ఖాయం అన్న అంచనాలకు అభిమానులు వచ్చేశారు. అయితే ఇప్పుడు సిద్దార్థ్ యూటర్న్ తీసుకుని బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్నట్లు ప్రకటన ఇవ్వడమే కాకుండా ఆమూవీకి ‘టైగర్ వర్సస్ పఠాన్’ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు లీకులు ఇవ్వగానే తమ హీరో ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడు అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

వాస్తవానికి సల్మాన్ షారూఖ్ లు చాలామంచి స్నేహితులు. షారూఖ్ ఖాన్ సినిమాలలో సల్మాన్ అనేకసార్లు అతిధి పాత్రలు కూడ చేసాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అతడి సినిమాలు హిట్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తన మిత్రుడుని ఆదుకోవడానికి షారూఖ్ ప్రభాస్ ను పక్కకు పెట్టేలా ఒత్తిడి చేసాడు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: