ఏఆర్ రెహమాన్ వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరుత్సాహం..!!

Divya
RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు హీరో రామ్ చరణ్.. ఇక రామ్ చరణ్ నటించబోతున్న సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లోని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్లోనే నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. కీలకమైన పాత్రలో తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో తన తదుపరిచిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది ..అదేమిటంటే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.గతంలో కూడా ఏఆర్ రెహమాన్ అందించిన తెలుగు సినిమాలకు సంగీతం సినిమాలన్నీ కూడా డిజాస్టర్లు గాని మిగిలాయి.. ముఖ్యంగా వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్ అనే సినిమా మహేష్ బాబు నటించిన నాని సినిమా పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి వంటి సినిమాలకు కూడ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయడం జరిగింది.

ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరో సినిమాకి ఇది బ్యాడ్ సెంటిమెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తెరకెక్కకముందే అప్పుడే ఇలాంటి నినాదాలు వినిపిస్తూ ఉండడంతో కాస్త అభిమానులు నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఏ మేరకు ఈ చిత్రా సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి. ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఎక్కువగా వేకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: