ఆ సూపర్ రికార్డుకి ఇంచుదూరంలో దసరా?

Purushottham Vinay
ఆ సూపర్ రికార్డుకి ఇంచుదూరంలో దసరా?

టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'దసరా'. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ సినిమాగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా బాగా సక్సెస్ అయ్యింది.ఈ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇక తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించి బాగా మెప్పించింది.ఈ సినిమాకు మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి వసూళ్లను అందిస్తూ వచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా కూడా హౌజ్‌ఫుల్ బోర్డులతో వసూళ్లతో థియేటర్లలో సందడి చేసింది. 


అందు ఫలితంగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నాని కెరీర్‌లోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక హీరో నానికి స్టార్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా దసరా సినిమా అల్లాడిస్తోంది. ఇక ఇప్పటికే 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చాలా ఈజీగా చేరిపోయిన దసరా సినిమా ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్‌పై కన్నేసింది. ఈరోజుతో ఈ సినిమా ఈజీగా ఈ మార్క్ ని అందుకుంటుంది.ఇక తాజా లెక్కల ప్రకారం దసరా సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $1.95 మిలియన్‌కు పైగా వసూళ్లు సాధించినట్లుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ దసరా సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఈ వీకెండ్‌లో ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.చూడాలి ఇక ఈ దసరా సినిమా ఇంకెన్ని రికార్డులని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: