మహేష్ సినిమా వల్ల చాలా నష్టపోయాను :: దిల్ రాజు

murali krishna
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే దిల్ రాజు కి సినిమాలు ఎలా చేయాలి ఎంత బడ్జెట్ లో చేయాలి అనే విషయం చాలా బాగా తెలుసు అందుకే ఆయన ఎంత బడ్జెట్ లో సినిమా చేసిన కూడా దానికి తగ్గ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు మొత్తానికి ఆ సినిమా కి పెట్టిన బడ్జెట్ అంతే కాదు తన సినిమాని ఎలా ప్రమోషన్ చేసుకోవాలో కూడా దిల్ రాజు కి బాగా తెలుసు ఎవరితో ఏ రకంగా ప్రమోషన్స్ చేపిస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అనే విషయాల్లో దిల్ రాజు చాలా క్లారిటీ గా ఉంటాడు.అందుకే డిస్టిబ్యూటర్గా కెరీర్ను ఆరంభించి ఆ తర్వాత సక్సెస్ ఫుల్ నిర్మాతగా ( producer ) రాణించగలుగుతున్నారు ... టాలీవుడ్లోనిఅందరు హీరోలతో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతగా దిల్ రాజుని చెప్పవచ్చు .
దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్( ram Charan ) హీరోగా , డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్( Game Changer ) మూవీని నిర్మిస్తున్నారు. దీనికోసం వంద కోట్లకు పైగానే బడ్జెట్ను పెడుతున్నారు. అలాగే, కల్యాణ్ రామ్తోనూ ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. ఇటీవలే బలగంతో హిట్ కొట్టారు. సమంత - గుణశేఖర్ కాంబినేషన్లో రాబోతున్న శాకుంతలం మూవీకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా నిర్మాత దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇందులో తన వ్యక్తిగత విశేషాలు, గత చిత్రాల అనుభవాలను సైతం పంచుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ విషయాలను కూడా వెల్లడించారు. స్పైడర్ సినిమా వల్ల తనకు ఎదురైన నష్టాల గురించి తొలిసారి బయట పెట్టారు. 2017లో నిర్మాతగా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అదే సంవత్సరం మహేశ్ - మురుగదాస్ స్పైడర్' ను కొన్నాను. ఈ సినిమా వల్ల ఏకంగా 12 కోట్లు లాస్ వచ్చింది అంటూ షాకింగ్ లెక్కలను బయటపెట్టాడు అదే సంవత్సరం పవన్ కల్యాణ్ హీరోగా చేసిన అజ్ఞాతవాసి రైట్స్ను ఫ్యాన్సీ రేటుకు కొనడం .. ఆ మూవీ వల్ల 13 కోట్లు నష్టం రావడం జరిగింది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు .ఒకే సంవత్సరం రెండు సినిమాలకే 25 కోట్లు పోగొట్టుకున్నా. ఒకవేళ నిర్మాతగా హిట్లు కొట్టకపోయి ఉంటే ఇవి కవర్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు అని దిల్ రాజు అన్నారు. డిస్ట్రిబ్యూటర్గా పోగొట్టుకున్న డబ్బును నిర్మాతగా హిట్లు కొట్టడం వల్ల సరి చేయగలుగుతున్నా. నేను పంపిణీ చేసిన చిత్రాల్లో బాహుబలి'కి వచ్చిన 10 కోట్ల లాభమే హయ్యెస్ట్. ఇంత పెద్ద మొత్తం మరే సినిమాకు కూడా రాలేదు. డిస్ట్రిబ్యూషన్ అంటే అలాగే ఉంటుంది అంటూ ఆయన షాకింగ్ నిజాలని బయటపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: