పవన్ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగం గా కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోదయ సీతం కు రీమిక్ గా రూపొందుతున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి పవన్ చాలా తక్కువ రోజులను కేటాయించినట్లు మొదటి నుండి వార్తలు కూడా వచ్చాయి.

అందుకు తగినట్లు గానే ఈ మూవీ కి పవన్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తుంది. ఇలా అతి తక్కువ రోజులను ఈ మూవీ కి కేటాయించడంతో పవన్ ఇప్పటికే ఈ సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన కేవలం కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ చిత్ర బృందం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా మరి కొన్ని రోజుల్లో పవన్ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: