"ఏజెంట్" మూవీలో అది ఉంటుంది కానీ ... మీరు ఊహించిన రేంజ్ లో ఉండదు ... అఖిల్..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాక్ష వైద్య ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇది ఇలా ఉంటే సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ కావడం ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని కూడా దర్శకుడు సురేందర్ రెడ్డి పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బంధం కొన్ని పాటలను మరియు కొన్ని పోస్టర్ లను ... టీజర్ ను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా అఖిల్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా తాజాగా అఖిల్ ఈ సినిమాలో లవ్ సన్నివేశాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.  ఈ మూవీ లో లవ్ సన్నివేశాలు ఉంటాయి కానీ ... మీరు ఊహించినంత రేంజ్ లో మాత్రం ఉండవు అని క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్స్ సన్నివేశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: