"ఓటిటి" లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న "రంగమార్తాండ" మూవీ..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి చంద మామ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు పలు మూవీ లకు దర్శకత్వం వహించగా అందులో కొన్ని సినిమాలు మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్ష కుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి .

 అలా చాలా సంవత్సరాల పాటు వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కృష్ణ వంశీ తాజాగా "రంగ మార్తాండ" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో కృష్ణ వంశీ తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ... రమ్య కృష్ణ ... బ్రహ్మానందం కీలకమైన పాత్రలలో నటించగా ... అనసూయ ,  రాహుల్ సిప్లింగజ్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల నుండి అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. దానితో ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: