రవితేజ లాస్ట్ 5 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే రవితేజ అకరుగా నటించిన 5 మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. రవితేజ పోయిన సంవత్సరం చివరన ధమాకా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.66 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ తో ప్రేక్షకులం పలకరించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.82 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రవితేజ పోయిన సంవత్సరం ఖిలాడి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల కలక్షన్ లను సాధించింది. రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల కలెక్షన్ లను సాధించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించి వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: