2023లో రెండు అత్యధిక రోజులు 1కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను వసూలు చేసిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఎన్నో  మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో ఎక్కువ రోజులు ఒక కోటి షేర్ కంటే ఎక్కువ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి షేర్ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి అంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ 8 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను చేసింది. తలపతి విజయ్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారసుడు అనే తమిళ డబ్బింగ్ సినిమా 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లని చేసింది. విశ్వక్ సేన్ హీరోగా మరియు దర్శకత్వంలో రూపొందిన దాస్ కా దమ్కి సినిమా 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. నివేత పేత్ రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: