శాకుంతలం సినిమాపై అవన్నీ రూమర్సే..!!

Divya
టాలీవుడ్ లో సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతోంది. శకుంతల పాత్రలో సమంతను చూడడానికి సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా శకుంతల దృశ్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీపై ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది అయితే ఎట్టకేలకు ఈనెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నది.. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టాక్ సినీ ప్రేక్షకులను సమంతా అభిమానులను కలవర పెట్టేలా చేస్తోంది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. శాకుంతలం  చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ అమెరికాలో విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉంటే అమెరికా డిస్ట్రిబ్యూటర్ గా రాధాకృష్ణ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇవి కేవలం రూమర్స్ అన్నట్లుగా తెలియజేశారు.

ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా ప్రస్తుతం ఎలాంటి పోటీ లేకపోవడం వల్ల సానుకూలంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు విడుదలైన దసరా రావణాసుర సినిమాలు శాకుంతలం సినిమా  విడుదల సమయానికి వీటి హవా కాస్త తగ్గే అవకాశం ఉంది దీంతో ఈ సినిమా పైన ప్రభావం పెద్దగా చూపదని సమంతా అభిమానులు తెలియజేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం కూడా పలు ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది ఇప్పటికి ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా శాకుంతలం  సినిమా ఓపెనింగ్స్ కూడా బాగుంటాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్హ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: