"గేమ్ చేంజర్" మూవీలో మొదటగా ఆ హీరోని పెట్టాలి అని శంకర్ అనుకున్నారు... దిల్ రాజు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను మరియు రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ , సునీల్ , అంజలి ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దిల్ రాజు "గేమ్ చేంజర్" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... దర్శకుడు శంకర్ గారు నాకు 45 నిమిషాల పాటు గేమ్ చేంజర్ మూవీ కథ ను చెప్పారు. మొదట పవన్ కళ్యాణ్ ను హీరో గా పెట్టాలి అని శంకర్ అనుకున్నారు. కానీ కళ్యాణ్ గారి కంటే కూడా రామ్ చరణ్ కి ఈ కథ బాగా సెట్ అవుతుంది అని నేను అన్నాను అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: