ఆ తేదీల్లో జపాన్ లో రామ్ చరణ్ "రంగస్థలం" మూవీ స్పెషల్ షోలు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ మూవీ 2018 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.


ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... సమంత ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ లో అనసూయ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కొంత కాలం క్రితమే ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కొంత కాలం క్రితమే జపాన్ లో విడుదల చేశారు.

 ఈ మూవీ జపాన్ లో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ జపాన్ లో విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీకి జపాన్ లో అద్భుతమైన కలెక్షన్ లు వస్తున్నాయి. ఈ మూవీ ద్వారా జపాన్ లో రామ్ చరణ్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇలా రామ్ చరణ్ కు ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా జపాన్ లో ఫుల్ ఏర్పడడంతో రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటువంటి రంగస్థలం మూవీ ని జపాన్ లో ఏప్రిల్ 9 , 10 ,  11 వ తేదీలలో స్పెషల్ షో లు వేయనున్నట్లు తెలుస్తోంది. మరి రంగస్థలం మూవీ స్పెషల్ షో లకు జపాన్ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: