"వార్ 2" లో ఎన్టీఆర్ పాత్రపై అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోయే వార్ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

 ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు అనే ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో పెరిగి పోయింది. దీనితో ఈ మూవీ లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అని ... దానితో ఈ మూవీ లో హృతిక్ రోషన్ కు మరియు ఎన్టీఆర్ కు మధ్య అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కాకుండా హీరో పాత్రలో కనిపించబోతున్నట్లు దానితో హృతిక్ కు మరియు ఎన్టీఆర్ కు మధ్య వార్ సన్నివేశాలు కాకుండా స్నేహ పూరిత సన్నివేశాలు మాత్రమే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని ప్రకటన రావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: