ఇండియన్ రా ఏజెంట్ గా రామ్ చరణ్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..?

Anilkumar
బాలీవుడ్ ఆగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో ఇప్పుడు మన టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం భాగమవుతున్నారు. తాజాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీలో డేంజరస్ స్పై గా కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ను ఢీకొట్టబోయే పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు ఇప్పటికే బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ ఒక్కడే కాదు మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్లో తెగ వైరల్ గా మారుతుంది. 

ఇప్పటికే బాలీవుడ్లో స్పై క్యారెక్టర్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకున్న హృతిక్ రోషన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ లాంటి హీరోల పక్కన ఇప్పుడు మన ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా చేరబోతున్నారట. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ను ఎలాగైతే వార్ 2 లో ఇన్వాల్వ్ చేయబోతున్నారో.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని 'పఠాన్ 2'లో ఇన్వాల్వ్ చేయబోతున్నారట. ఈ మేరకు యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఈసారి రామ్ చరణ్ ని ఓ పవర్ఫుల్ స్పై గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పఠాన్ 2 కి సంబంధించిన ఆలోచన ఇంకా ఇనీషియల్ స్టేజ్ లోనే ఉన్నప్పటికీ.. ఈ మూవీలో రామ్ చరణ్ ఇండియన్ రా ఏజెంట్గా కనిపించడున్నాడని బాలీవుడ్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇక త్వరలోనే ఇందుకు సంబంధించి యష్ రాజ్ ఫిలిమ్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చెర్రీ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కంప్లీట్ పొలిటికల్ బ్యాడ్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: