మహేష్ ... రాజమౌళి మూవీ లో హాలీవుడ్ నటుడు..?

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీcకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. రామ్ చరణ్ ఈ మూవీ లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించగా ... ఎన్టీఆర్ ఈ మూవీ లో కొమరం భీం పాత్రలో నటించాడు.

 ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్ నటించగా ... ఎన్టీఆర్ కు జోడిగా ఓలీవియా మోరిస్ నటించింది. పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ ఇప్పటికి కూడా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ కి కొన్ని రోజుల క్రితమే "నాటు నాటు" పాటకు గాను ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ ఆస్కార్ అవార్డు ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. అలాగే రాజమౌళి కి కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హాలీవుడ్ నటుడు విలన్ గా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మహేష్ ... రాజమౌళి కాంబినేషన్ మూవీ లో థార్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ విలన్ గా నటిస్తున్నారు అంటూ మరొక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ ప్రారంభ కాక ముందే ఈ మూవీ పై భారీ లెవెల్ లో అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: