ఎన్టీఆర్ 30లో అలాంటి పాత్రలో జాన్వి కపూర్..?

Pulgam Srinivas
బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ నటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక హిందీ సినిమా లలో నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ నటిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇలా ఇప్పటి వరకు హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది  అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


 ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయక పోవడంతో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం ప్రారంభించింది  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో జాన్వి కపూర్ పాత్రకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో జాన్వీ ఓ మత్స్యకారుని కూతురిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం జాన్వి చాలా ఫోకస్ పెట్టింది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కు సౌత్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మూవీ కి చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. అలాగే ఈ మూవీ లో దేశం లోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులు నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: