2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నాని తన కెరీర్ ప్రారంభంలో తక్కువ బడ్జెట్ మూవీ లలో నటించి సూపర్ హిట్ విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు తో పాటు కన్నడ , మలయాళ , హిందీ , తమిళ్ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను దక్కించుకుంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటి వరకు వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ రోజు నుండి ఈ మూవీ రెండవ వీక్ లోకి అడుగు పెడుతుంది. ఈ సినిమా రెండవ వారంలో ఎన్ని థియేటర్ లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతుందో తెలుసుకుందాం.

ఈ మూవీ రెండవ వారం నైజాం ఏరియాలో 165 ప్లస్ ధియేటర్ లలో ప్రదర్శించబడుతూ ఉండగా ... సీడెడ్ లో 70 థియేటర్ లలో ప్రదర్శించబడుతూ ఉండగా ... ఆంధ్ర ఏరియాలో 205 ప్లస్ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ వారం 440 ప్లస్ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని కి జోడి గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: