బాలయ్య కోసం వెనక్కి తగ్గనున్న బోయపాటి...!!

murali krishna
రామ్ కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ''RAPO20''..
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణం లో ఈ సినిమా కూడా భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుందని తెలుస్తుంది.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను శరవేగంగా జరుపు కుంటుంది.. రామ్ పోతినేని తో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నారు.
టైర్ 2 హీరోల్లో 50 కోట్లకు పైగానే బడ్జెట్ తో సినిమాలు చేస్తుండడం అయినా భారీ కలెక్షన్స్ రాబట్టడంలో వీరికి కూడా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కూడా అస్సలు వెనుకాడడం లేదు.. పైగా బోయపాటి అంటే మినిమమ్ ఆ రేంజ్ లో అయితే ఉండాలి.. ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది... మరి ఇదే సమయంలో రవితేజ కూడా పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు తో రాబోతున్నాడని సమాచారం..
అయితే ఈ ఇద్దరి స్టార్ హీరోలను బాలయ్య వెనక్కి నెట్టేస్తున్నాడా..బాలయ్య కూడా తన లేటెస్ట్ సినిమాతో దసరాకు రాబోతున్నట్టు అనౌన్స్ చేసి వారికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ ముగ్గురు ఒకే సమయంలో కనుక వస్తే అది కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.. అందుకే ఎవరో ఒకరైన వెనక్కి తగ్గితేనే భారీ నష్టం వాటిల్లకుండా ఉంటుందని తెలుస్తుంది.. మరి బాలయ్య కోసం బోయపాటి నే వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం.. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం రామ్ సినిమానే వెనక్కి తగ్గే ఛాన్స్ అయితే ఉండవచ్చని.. రవితేజ అయితే ఈ పోటీలో వెనక్కి తగ్గే ఛాన్స్ లేదని కూడా అంటున్నారు. బోయపాటికి బాలకృష్ణకు మధ్య ఉన్న అనుబంధం కారణంగా రామ్ సినిమా తగ్గక తప్పడం లేదని.. పండుగ సీజన్ లో రామ్ సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా నిరూపించుకోవాలని చూస్తున్నాడని తెలుస్తుంది. కానీ రామ్ ఆశలు అడి ఆశలు అయ్యాయి.. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: