హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రవితేజ కొడుకు...!!

murali krishna
రవితేజ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.కొంచెం కూడా గ్యాప్ లేకుండా సినిమా మీద సినిమా చేస్తున్నారు. రవితేజ నటించినా కొత్త చిత్రం " రావణాసుర ".ఈ సినిమాలో రవితేజ తో పాటుగా సుశాంత్ అక్కినేని కూడా నటించారు ఇందులో హీరోయిన్స్ గా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు తో కలిసి నటించి ప్రేక్షకులను అలరించబోతున్నారటా.
ఇందులో మేఘఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్ అలాగే దక్షనాగర్కర్, పూజిత పున్నాడ నటించారు . బడ్జెట్ 50 కోట్ల వరకు పెట్టారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ హర్షవర్ధన్, భీమ్స్.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ తో జరిగిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ను చెప్పుకొచ్చారు....హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన షాక్ సినిమాలో రోడ్డుపైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి పూర్తి అయిపోయిన తర్వాత కారులో కాకుండా అదే బైక్ లోనే పద్మాలయ స్టూడియోస్ కి వచ్చేసారని చెప్పుకొచ్చారు.
హరీష్ శంకర్ ఆశ్చర్యపోయి అన్నయ్య మీరు బైక్ పైన రావడమేంటి మీకు ఇబ్బంది గా ఉండదా అని అడిగితే ఎందుకు ఇబ్బంది ఇదే రోడ్స్ పైన సినిమా ఛాన్స్ ల కోసం నేను తిరిగాను అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏదైనా మనం ఫీల్ అయ్యే దాని పైన ఆధారపడి ఉంటుంది అని అన్నారట.హరీష్ శంకర్ ఆ మాటకు నిజంగానే షాక్ అయ్యారని తెలుస్తుంది.తన కొడుకు మహాదన్ ఎంట్రీ ఎప్పుడు అని హరీష్ శంకర్ అడగగా తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాడు నేను తనపై ఎటువంటి ఒత్తిడి ని పెట్టను,వాడికి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాడు హీరో గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనేది మాత్రం వాడి ఇష్టం అంటూ రవితేజ చెప్పారటా..అయితే వాడికి నేను ఎటువంటి సజెషన్స్ అయితే ఇవ్వను తనకు తానే తెలుసుకుంటేనే జీవితంలో ఎదుగుతాడు అని చెప్పుకొచ్చారు..రావణాసుర చిత్రం ఏప్రిల్ 7 న మన విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: