అఫీషియల్ : ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "రంగమార్తాండ" మూవీ..!

Pulgam Srinivas
తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత అనేక మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు.

ఇది ఇలా ఉంటే అలా వరుస అపజయాలతో డిలా పడిపోయిన కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించగా ... అనసూయ , రాహుల్ సిప్లింగజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో కృష్ణవంశీ కూడా తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 7 వ తేదీ నుండి ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: