రజినీ 171 మూవీకి దర్శకత్వం వహించనున్న ఆ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీ కాంత్ "జైలర్" అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ... తమన్నా ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ మూవీ తర్వాత కూడా తనకు సంబంధించిన కొన్ని మూవీ లను సెట్ చేసి పెట్టుకున్నాడు. అందులో భాగంగా రజనీ కాంత్ కెరియర్ లో 170 మూవీ ని టి జి జ్ఞ్యానవేల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత రజిని తన 171 వ మూవీ కి సంబంధించిన దర్శకుడిని కూడా ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... రజిని 171 వ మూవీ కి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ కనకరాజు ... తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: