ట్రోల్స్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ తో ఎక్కువగా చర్చల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక నెగిటివ్ ట్రోల్స్ పై స్పందించారు. నిర్మాతగా 20 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ లో తాను చాలా రకాల కష్ట నష్టాలను చూశానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ఒక సాధారణ చిన్న సినిమాల నిర్మాత స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్థాయి నిర్మాతగా పేరు పొంది పెద్ద పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యానని దిల్ రాజు వివరించారు.ఈ క్రమంలోనే మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు చాలా రకాల సమస్యలు కూడా పెరిగాయన్నారు.టాలీవుడ్ లో పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ గా మారినప్పటి నుంచి తనను చూసి కుళ్లుకునే వాళ్లు కింద పడేయాలని చూసే వాళ్లు చాలా ఎక్కువయ్యారన్నారు. ఈ క్రమంలోనే తమకు ఏ సంబంధం లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా పలు రకాలుగా ట్రోల్స్ ఇంకా కామెంట్లు చేస్తూ... తన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని దిల్ రాజు వివరించారు. ఇక గత కొంత కాలంగా అయితే తనను వ్యక్తిగతంగా నష్ట పరిచేందుకు చాలా ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారన్నారు దిల్ రాజు.అందుకే ఈ విషయాలపై స్పందించాల్సి వస్తుందని దిల్ రాజు వివరించారు. తన తప్పు ఉంటే ఎంత మంది ముందైనా కూడా క్షమాపణ చెబుతానన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తాను అస్సలు వాటిని పట్టించుకోనన్నారు. ప్రతీసారి కూడా తాను ఆత్మపరిశీలన చేసుకుంటానన్నారు.


ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పు చేయకుండా ఉండేందుకు ట్రై చేస్తానని దిల్ రాజు స్పష్టం చేశారు.ఒక మానవత్వం ఉన్న మనిషిగా తన వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకుంటానన్నారు.అయితే ఈ సోషల్ మడియాలో వచ్చే రూమర్లు నెగిటివిటీ గురించి తన టీం సభ్యులు.. తనను కలిసినప్పుడల్లా అందరు అడుగుతున్నారన్నారు. ఇలా తనపై వచ్చే విమర్శలు గురించి చెబుతున్నారని.. అప్పుడు కాస్త బాధనిపిస్తుందని దిల్ రాజు అన్నారు.అయితే తనతో ఉన్నవాళ్లకు తనతో పని చేసిన వాళ్లకు తాను ఎలాంటి వాడో పూర్తిగా తెలుసని.. కానీ సామాన్య ప్రజలకు తెలియక వచ్చే నెగిటివ్ టాక్ నిజమనుకుంటున్నారని దిల్ రాజు అన్నారు.సినిమా ఇండస్ట్రీలో తాను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులో తాను భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న దిల్ రాజు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లతో సినిమాలు చేస్తానని చెప్పారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ సుకుమార్ లతో కూడా సినిమాలు చేసే ఆలోచన ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: