నాకు కాబోయే భర్త గుడ్డివాడు, పిచ్చివాడై ఉండాలి :: సారా అలీ ఖాన్

murali krishna
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.
సైఫ్ అలీ ఖాన్ తనయగా చిత్రసీమలో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత విషయాల్లోనూ ఓపెన్‌గా మాట్లాడుతుంది. ప్రస్తుతం ఆమె నటించిన గ్యాస్‌లైట్ అనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్త, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు కాబోయే వరుడు గుడ్డివాడు, పిచ్చివాడై ఉండాలని సరదాగా జోక్ చేసింది.
"ప్రస్తుతం నాకు కాబోయే భర్త కోసం చూస్తున్నాను. అతను గుడ్డివాడు, పిచ్చివాడై ఉండాలి. నాకు అలాంటి వాడే కావాలి. ఎందుకంటే కాస్త తెలివిగా ఉన్నా నా గురించి మొదట్లోనే తెలుసుకుని పారిపోతాడు." అంటూ జోక్ చేస్తూ మాట్లాడింది.
అసలు పెళ్లిపై ఇంట్రెస్ట్ ఉందా అని అడుగ్గా.. తప్పకుండా ఉంది అంటూ బదులిచ్చింది. "నాకు పెళ్లిపై ఆసక్తి ఉంది. కానీ ప్రతిదీ సరైన సమయంలో జరుగుతుందని భావిస్తున్నాను. ఇప్పటికై ఆ సమయం రాలేదు. వివాహం కోసం ఎదురుచూస్తున్నాను." అంటూ సారా స్పష్టం చేసింది.
సారా అలీ ఖాన్ గతంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్ చేసింది. వీరిద్దరూ లవ్ ఆజ్ కల్ అనే సినిమా కోసం పనిచేయగా.. ఆ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారు. అయితే కొద్ది కాలం తర్వాత వీరిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యంగా ఉంచుతుంది ఈ ముద్దుగుమ్మ. పని విషయానికొస్తే సారా.. విక్కీ కౌషల్‌తో కలిసి లక్ష్మణ్ ఉతేకర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఈ ఏడాది చివర్లో రానుది. ఇది కాకుండా ఏ వతన్ మేరా వతన్ అనే మరో సినిమా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: