శాకుంతలం:ట్రైలర్ తో అదరగొట్టేస్తున్న సమంత..!!

Divya
హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా నుంచి అప్డేట్ ప్రతి ఒక్కరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.. ట్రైలర్ అద్వంత శకుంతల వ్యధ రాజకుమారుడు కథ ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ గ్రాఫిక్స్ పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.. ఈ చిత్రంలోని లొకేషన్స్ ప్రకృతి అందాలు కూడా ఈ చిత్రాన్ని మరింత అందంగా చూపించేలా కనిపిస్తున్నట్లు ఈ ట్రైలర్లో తెలుస్తోంది. ఇక వీటన్నిటిని మించి శకుంతలం కథ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతోందని చెప్పవచ్చు.  శకుంతల ప్రేమలో పడిన దృశ్యంతో ఆ తర్వాత శకుంతల జీవితంలో జరిగిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజుగా కథానాయకుడుగా అహర్యం ఆకట్టుకుంటున్నారు దుశాంత్ మహారాజు..

శకుంతలంతోపాటు రాజు మాట్లాడే ప్రతి పదం కూడా జానపద నాటి అందమైన భాషగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.దుష్యంతు పుర రాజవంశం తాలూక వైభవం అసాధారణమని ట్రైలర్లు చెబుతోంది. ట్రైలర్ విఎఫ్ ఎక్స్ తో కట్టిపడేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా శకుంతలం అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన కాళిదాసు సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గుణశేఖర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ప్రాజెక్టుకు సంగీతాన్ని మణిశర్మ అందించారు.. అలాగే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, మధుబాల, గౌతమి తదితరులు నటించారు. ఈ చిత్రం అన్ని భాషలలో 2d త్రీడీలలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: