"రావణాసుర" మూవీ థీమ్ సాంగ్ విడుదల సమయాన్ని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజుల నుండి ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ... పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ధీమ్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని భుజాలపై ఒక వ్యక్తిని మోసుకుంటూ స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్నాడు.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మేఘ ఆకాష్ , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పన్నొడ , ఫరియ అబ్దుల్లా హీరోయిన్ లుగా కనిపించనున్నారు. సుధీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ధమాకా మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న రవితేజ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: