ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో తన క్రేజ్ ను గ్లోబల్ గా పెంచుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ లను కూడా అదే రేంజ్ లో ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందు లో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్న కొరటాల శివ దర్శకత్వంలో తన కెరియర్ లో 30 వ మూవీ ని ప్రారంభించాడు .

ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించ బోతున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు చాలా మంది పని చేయనున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించ బోతున్నట్లు ప్రకటించాడు . కాకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీ ల లిస్ట్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ మూవీ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటు వంటి ఆర్యన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోయే వార్ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ ... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూడు మూవీ లను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: