అన్నపూర్ణ స్టూడియోలో ప్రభాస్ మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే మారుతీ దర్శకత్వంలో ఒక మూవీ ని ఓకే చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలానికి ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ అయిన తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ సినిమా యూనిట్ మళ్ళీ తిరిగి ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ఈ చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించింది. ఇది ఇలా ఉంటే తాజా షెడ్యూలు అన్నపూర్ణ స్టూడియోలో 20 రోజుల పాటు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 10 రోజుల షెడ్యూల్ లో ఈ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించబోతున్న నటీ నటులపై ... కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరించబోతున్న తెలుస్తుంది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చక చకా పూర్తి చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం విడుదల చేయాలి అని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన మాలవికా మోహన్ ... నిధి అగర్వాల్ ... రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మూవీ లో ప్రభాస్ కు తాత పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: