పవన్ కళ్యాణ్ తో మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుదీర్ వర్మ..!

Pulgam Srinivas
స్వామి రారా మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుదీర్ వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న ఈ దర్శకుడు తాజాగా రవితేజ హీరోగా రూపొందినటు వంటి రావణాసుర అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ దర్శకుడు అయినటు వంటి సుధీర్ వర్మ కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధీర్ వర్మ  ... పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితమే సుధీర్ వర్మ ... పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరో సారి సుధీర్ వర్మ ... పవన్ తో మూవీ గురించి మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారితో నేను తీయబోయే సినిమా త్రివిక్రమ్ గారి కథతో ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు ... ఏంటి అనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది అని సుధీర్ వర్మ చెప్పకచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు మూవీ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: