ఎన్టీఆర్ 30 వ మూవీ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రుపొందుతుంది. ఆ నేపథ్యంలో ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఈ మూవీ బృందం ఫిక్స్ చేయకపోవడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఎన్టీఆర్  30 అని ప్రకటించింది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన వీడియోను కూడా ఈ చిత్ర బృందం 5 భాషలలో విడుదల చేసింది. ఆ వీడియోకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా ...  రత్నవేలు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

 ఇ
ది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రకాష్ రాజు విలన్ కాదట అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొరటాల శివ తన కెరియర్ లోనే అత్యంత గ్రాండ్ మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: