బాలయ్య సినిమాలో.. బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు వయస్సు పెరిగే కొద్ది కాస్త సినిమాలు చేయడం కూడా తగ్గిస్తూ ఉంటారు. కానీ బాలయ్య విషయంలో మాత్రం ఇదంతా విరుద్ధంగా జరుగుతుంది. ఆయన వయసు పెరుగుతున్న కొద్ది ఇంకా యువకుడిలా మారిపోతున్నాడు అని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా బాలయ్యలో కొత్త బాలకృష్ణను చూస్తున్నాడు అని చెప్పాలి. ఎప్పుడు రెడ్ బుల్ తాగినంత ఎనర్జీతో కనిపిస్తున్న బాలయ్య అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట సందడి చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

 మరోవైపు అన్ స్టాపబుల్ తో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంకోవైపు ఐపీఎల్ లో కూడా కామెంట్రీ ఇస్తూ అక్కడ బిజీగా మారిపోయాడు. దీంతో యువకుడిగా ఉన్నప్పటి కంటే ఇక ఇప్పుడే బాలకృష్ణ మరింత జోష్ లో కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు వరుస సినిమాలతో సూపర్ హిట్లు కూడా సాధిస్తూ యువ హీరోలకు సైతం సాధ్యం కాని స్పీడ్ మెయిన్టైన్ చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

 కానీ అటు బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఫాన్స్ నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పాలి. అయితే సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే అటు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. దీంతో రికార్డు బాలయ్య లోని కామెడీ యాంగిల్ ని అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య అనిల్ రావుపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఒక బిగ్ ట్విస్ట్ ఉండబోతుందట. బాలయ్య కు శ్రీ లీల కూతురుగా కనిపిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీలీలా అసలు బాలయ్య కూతురు కాదట. బాలయ్య కు శరత్ కుమార్ అన్నయ్యగా నటిస్తుండగా.. అతని కూతురుగానే శ్రీ లీల నటిస్తుందట. అతను చనిపోవడం వల్ల ఇక బాలయ్య శ్రీలీలను  సొంత కూతురులా పెంచుకుంటాడట. ఇంటర్వెల్లో ఈ ట్విస్ట్ రివిల్  చేయాలని అనుకుంటున్నాడట అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: