శోభిత-చైతు వ్యవహారం నాకు సంబంధం లేదు..సమంత..!!

Divya
టాలీవుడ్ లో సమంత, నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు. వీరిద్దరూ 6 సంవత్సరాలు ప్రేమించుకుని వివాహం చేసుకొని నాలుగేళ్లు కలిసి ఉండి విడిపోవడం జరిగింది. అయితే వీరిద్దరూ ఇలా విడిపోవడంతో అనూహ్యంగా వీరి మధ్య విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గాని మిగిలిపోయాయి. అలా వీరిద్దరు విడిపోయిన తర్వాత వీరిద్దరిపైన పలు రూమర్లు కూడా బాగానే పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.
ఇదంతా ఇలా ఉండగా సమంత తో విడాకుల తర్వాత నాగచైతన్య మరొక హీరోయిన్ శోభితతో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. లండన్ లో ఒక రెస్టారెంట్లు డిన్నర్ డేట్ కి వెళ్లడం ఆ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడం ఇలా వైరల్ గా మారడంతో మళ్ళీ ట్రెండీగా మారారు. ఒక ఇంటర్వ్యూలో సమంత, నాగచైతన్య డేటింగ్ రూమర్ పైన స్పందించినట్లుగా వార్తలు వినిపించాయి.. ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారన్నది నేను అసలు పట్టించుకోను ప్రేమ విలువ తెలియని వాళ్ళు ఎంతోమంది తో డేటింగ్ చేసిన చివరికి మిగిలేది కన్నీళ్లే కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలని తను ప్రవర్తన మార్చుకోని అమ్మాయిని నొప్పించకుండా ఉంటే అందరికీ మంచిదని విషయాన్ని తెలియజేసినట్లు ఒక వార్త వైరల్ గా మారింది.

అయితే ఈ మాటలను తాను అసలు అనలేదని.. తనకు ఈ విషయం పైన ఎలాంటి సంబంధం లేదని స్వయంగా సమంత తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది. 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, చైతు 2021 లో విడిపోయారు. అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది దీన్ని బట్టి చూస్తే కావాలని కొంతమంది నెటిజెన్స్ ఇలా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: