'మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి'.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా బాల నటుడిగా గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమాతో స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత పోకిరి సినిమాతో ఏకంగా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక స్టార్డం వచ్చిన తర్వాత కూడా మహేష్ సినిమాలు పరంగా ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్ గుణశేఖర్ సూపర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

గుణశేఖర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం శాకుంతలం ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. రీసెంట్గా గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.మ్ ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మహేష్ గురించి గుణశేఖర్ మాట్లాడుతూ.." మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో సినిమా చేశామంటే చాలు అతనికి అడిక్ట్ అయిపోతాం. మళ్ళీ మళ్ళీ అతనితోనే సినిమా చేయాలని అనిపిస్తుంది. అలా ఇప్పటివరకు నేను ఆయనతో ఒక్కడు, అర్జున్, సైనికుడు వంటి సినిమాలు తీశాను.

ఈ తరం హీరోల్లో ఒక డైరెక్టర్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోని ఎక్కడైనా చూశారా? నేను కూడా మహేష్ బాబు తో తీస్తే సరిపోదు. వేరే హీరోలతో కూడా తీయాలి. అందుకే ఇంత గ్యాప్ ఇచ్చాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గుణశేఖర్. ఇక రుద్రమదేవి సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా శాకుంతలం. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతోనే బాలనటిగా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: