అయ్యగారితో దసరా డైరెక్టర్..?

shami
దసరా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ధూం ధాం హడావిడి చేసిన నాని కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇన్నాళ్లు మనం చూసిన నాని వేరు దసరా సినిమాలో నాని వేరు అనిపించేలా ధరణి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు నాని. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ కన్విక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనికిది మొదటి సినిమాలా కాకుండా ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వాడిలా చేశాడు. సినిమాకు అన్నీ అలా కుదిరాయి కాబట్టే సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది.
ఇక ఈ సినిమా సక్సెస్ తో నిర్మాత చెరుకూరి సుధాకర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఒక విలువైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది. 80 లక్షల విలువగల బి.ఎం.డబల్యుని శ్రీకాంత్ కు గిఫ్ట్ గా ఇచ్చారట నిర్మాత సుధాకర్. అంతేకాదు చిత్రయూనిట్ లో కీలకమైనవ్యక్తులకు దసరా నిర్మాత 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చారట. శ్రీకాంత్ ఓదెలతో సుధాకర్ మరో సినిమా కూడా చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని యువ హీరో అఖిల్ తో శ్రీకాంత్ సెకండ్ సినిమా ఉంటుందని టాక్. అఖిల్ కూడా ఏజెంట్ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. శ్రీకాంత్ ఎలాగు ఫస్ట్ మూవీతోనే సూపర్ అనిపించుకున్నాడు కాబట్టి అతనితో సినిమా అంటే అఖిల్ కి బెస్ట్ ఆప్షన్ అన్నట్టే లెక్క. అఖిల్ శ్రీకాంత్ ఈ కాంబినేషన్ సినిమాను కూడా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారని చెప్పుకుంటున్నారు. మరి అది నిజంగా జరుగుతుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఏజెంట్ సినిమా మీద భారీ అంచలాను ఉండగా ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడు అఖిల్. ఒకవేళ అఖిల్ తో శ్రీకాంత్ సినిమా ఓకే అయితే ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: